Share News

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:44 AM

ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పెద్దపల్లిటౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ కార్యాల యాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయాల నిర్వహణ సరిగ్గా లేవని, టాయి లెట్స్‌ మెయింటనెన్స్‌ మరింత మెరుగ్గా ఉండా లన్నారు. కార్యాలయాలో విధులు నిర్వహించే సిబ్బంది డైనింగ్‌ హాల్‌ వద్ద లంచ్‌ చేయాలని, ఆ డైనింగ్‌ హాల్‌ను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యా లయ రికార్డులు సరిగ్గా భద్రపరచాలని, ఎక్కడ పడితే అక్కడ వేయద్దని సూచించారు. కార్యాలయంలో అన వసరమైన రికార్డులు, చాలా పాతకాలంనాటి ఫర్ని చర్‌ను తొలగించాలని, పాడైపోయిన బీరువాలు అధి కంగా ఉండటం వల్ల ఎక్కువ స్థలం వాటికే సరిపో తుందని, వాటి స్థానంలో నూతన ఫర్నిచర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నాలుగు రోజులలో కార్యాల యంలోని స్టాఫ్‌ వినియోగించుకుని ప్రతి కార్యాల యం శుభ్రం చేసుకోవాలని, ఒక ఫైల్స్‌ వెంటనే తీసేలా సర్దుకోవాలని, ప్రతి ఫ్లోర్‌ వద్ద అదనం గా మరో మూడు పైప్‌లైన్‌ ఔట్‌లెట్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. పాత పాడైపోయిన ప్రస్తుతం ఉపయోగంలో లేని ప్రింటర్లు, సామాన్లను డి స్పోస్‌ చేయాలన్నారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సమర్థవం తంగా నిర్వహించాలని సూచించారు. కార్యా లయ డ్యూటీ సమయంలో క్షేత్రస్థాయి తనిఖీ లకు వెళితే రికార్డుల్లో ఆ వివరాలు నమోదు కావాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు వేణు, అరుణశ్రీ, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:44 AM