విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:25 AM
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. దీనిపై శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

సుభాష్‌నగర్, జనవరి 3(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. దీనిపై శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు సంబంధించి రూ. 133.35 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి రూ. 171 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం మూడు సంవత్సరాల్లో జిల్లాలో 1.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. బీసీల అభివృద్ధికి ప్రతియేటా బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి రూ. 9,200 కోట్లు కేటాయించడం బాధాకరమన్నారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం, మహిళ అఽధ్యక్షురాలు గుంటి స్వరూప, శ్యామ్, నగర అధ్యక్షుడు అనుమాస నితిన్, యువజన సంఽఘం ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల ఉమామహేశ్వర్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు నల్లగోని శ్రీనివాస్, మహిళ ఉపాధ్యక్షురాలు గంగాభవాని, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు.