పోలీస్ శాఖలో కష్టపడే వారికి మంచి గుర్తింపు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:29 AM
పోలీస్‌శాఖలో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు వస్తుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు.

కోల్‌సిటీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పోలీస్‌శాఖలో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు వస్తుందని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. రామగుం డం కమిషనరేట్‌లో పనిచేస్తున్న 13మంది ఏఎస్‌ఐలకు ఎస్‌ఐగా పదోన్నతి లభించడంతో వారికి గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పదోన్నతి ర్యాం కు చిహ్నాన్ని అలంకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు మరింత బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్‌శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ సుందర్‌రావు, ప్రతాప్, పోలీస్ అధి కారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు.