ఘనంగా గంగా పరమేశ్వరుల కల్యాణం
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:56 AM
నగరంలోని దేవుళ్లపురి, బైపాస్‌రోడ్, ఎల్‌ఎండీ, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గంగామాత ఆలయంలో గంగా పరమేశ్వరుల కల్యాణం, బోనాల మహోత్సవం, గంగామాత తెప్పోత్సవం, హారతి ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కరీంనగర్ కల్చరల్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నగరంలోని దేవుళ్లపురి, బైపాస్‌రోడ్, ఎల్‌ఎండీ, లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గంగామాత ఆలయంలో గంగా పరమేశ్వరుల కల్యాణం, బోనాల మహోత్సవం, గంగామాత తెప్పోత్సవం, హారతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు, మధ్యాహ్నం గంగా పరమేశ్వరుల కల్యాణం కన్నుల పండువలా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం గంగామాత తెప్పోత్సవం, గంగా హారతి వైభవంగా నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే మూట గోపాల్ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాక పావనకృష్ణ, మర్రి జనార్దన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూర ధర్మరాజ్, డోలి రాజన్న, శేర్వ లక్ష్మీనారాయణ, వెంపటి విశ్వప్రకాశ్, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గడప సత్యనారాయణ, పద్మ కనకరాజ్, నాయకులు పాల్గొన్నారు.