Share News

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:09 AM

యాసంగి ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి

సిరిసిల్ల, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం కొను గోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వ హించారు. టార్పాలిన్‌ కవర్లు, మరోసారి వినియోగించేందుకు అవకాశాలను పరిశీలించాలని, అవసరమైన వసతుల కల్పనపై పక్కాగా ప్రణాళిక ఉండాలన్నారు. టార్పాలిన్‌ కవర్లు, గన్నీ బ్యా గులు, వేయింగ్‌ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నవాటిపై నివేదిక అందించాలన్నారు. యా సంగి వరికోతలకు ముందే హార్వేస్టర్ల యజమానులతో సమా వేశం నిర్వహించి ప్రణాళిక తయారు చేయాలని అవసరమైన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వసతులతో పకడ్బందీ గా కార్యాచరణ తయారుచేయాలని అన్నారు. జిల్లాలో మిల్లర్లు బిల్డింగ్‌ కేపాసిటీ పెంచాలని మిల్లింగ్‌ సామర్థ్యం మేరకు జరగాలన్నారు. నిర్ధేశిత సమయంలో ఎఫ్‌సీఐకు సరఫరా పూర్తి చేయాలని ప్రతిరోజు కనీసం 16 గంటల వరకు మిల్లింగ్‌ జరిగేలా చూడాలని అన్నారు. రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న స్టాక్‌ను తనిఖీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మీ, మేనేజర్‌ రజిత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 01:09 AM