ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:14 AM
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సిరిసిల్ల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపధ్యంలో పోలింగ్ విధులు నిర్వహించడానికి కేటాయించిన సిబ్బందికి బుధవారం ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీకి కౌంటర్లు, ఏర్పాటు చేయాలని పోలింగ్ సిబ్బందికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా సామగ్రిని పంపిణీ చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూ షన్ సెంటర్‌లో తాగునీటి వసతి, భోజన వసతి కల్పించాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన పోలిం గ్ స్టేషన్‌కు వాహానాల్లో వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశిం చారు. కలెక్టర్ వెంట సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో రాధాభాయి, రాజేశ్వర్, తహసీల్దార్ ఉమారాణి, మహేష్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యలు ఉన్నారు.