కూలీ పెంచాలన్నందుకు పనులు ఇవ్వని యజమానులు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:44 AM
కూలీ పెంచా లంటూ కోరిన మరమగ్గాల కార్మికులకు పనులను ఇవ్వకుండా పరిశ్రమలను బంద్ చేసిన చేనేత కాటన్ చీరల తయారీ యజ మానులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు.

సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : కూలీ పెంచా లంటూ కోరిన మరమగ్గాల కార్మికులకు పనులను ఇవ్వకుండా పరిశ్రమలను బంద్ చేసిన చేనేత కాటన్ చీరల తయారీ యజ మానులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. కూలీ పెంచి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని చేనేత జౌళిశాఖ కార్యాల యంలో శుక్రవారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూని యన్ జిల్లా కమిటీ అధ్వర్యంలో మరమగ్గాల కార్మికులు తరలి వచ్చి ఏడీని కలిసి వినతిపత్రాలను అందించారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షుడు రమేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో మరమగ్గాలపై చేనేత కాటన్ చీరలను తయారుచేస్తున్న కార్మికులు, అసా ములకు కూలీ అగ్రిమెంట్ గత సంవత్సరం మే నెలలో ముగిసిపోయిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్మికులు, ఆసాములు, యజమా నులే ఆలోచించి కూలీ పెంచుతారని భావించి ఎని మిది మాసాల నుంచి ఎదురుచూడడం జరిగింద న్నారు. కానీ యజమానుల నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో ఫిబ్రవరి 4వ తేదీన కార్మికులు, ఆసాములు కూలీ పెంచాలని యజమానులకు వినతిపత్రాలను అందజేశారన్నారు. దీనికి యజ మానులు కార్మికులు, ఆసాములను పిలిపించుకొని వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తాము పరిశ్రమలను బంద్ చేస్తున్నామని, ఒకవేళ పని చేయదలచుకుంటే యజమాన్యానికి భవిష్యత్తులో ఎలాంటి కూలీ అడగమని, అధికారులను కలవకూడదని యూనియన్ వద్దకు వెళ్లకూడదనే ఆంక్షలను విధించి రాతపూర్వకంగా రాసి ఇస్తేనే పనులను కల్పిస్తామని బెదిరింపులకు గురిచేశారన్నారు. కార్మికుల, ఆసాముల కష్టంతో బతుకుతూ వారిని బానిసల కింద పరిగణిస్తున్న, కాటన్ చీరలను తయారీ చేయిస్తున్న యజమా నులపై చేనేత జౌళి శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుం డా చూడాలని కోరారు. లేని పక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వడ్నాల వీరేశం, నాయకులు ప్రతాప్, సూర్యనారాయణ, వేణు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.