విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:57 AM
విద్యారంగ సమ స్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు పీఅర్‌సీని వీలై నంత త్వరగా అమలుచేయాలని పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్య క్షుడు గన్నమనేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగ సమ స్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు పీఅర్‌సీని వీలై నంత త్వరగా అమలుచేయాలని పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్య క్షుడు గన్నమనేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్ట ణంలోని కొత్తబస్టాండ్ సమీపంలోగల పీఆర్‌టీయూ సంఘ స్థలం లో ఆదివారం పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు సామ ల యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ 54 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నామని అన్నారు. పీఆర్‌టీయూ సంఘం అలుపెరుగని పోరాటాల ఫలితంగానే ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్థాయి పెరగడంతోపాటు సమాజంలో గౌరవంగా జీవించే స్థాయికి చేరుకున్నారన్నారు. గతంలో ప్రభుత్వాలు 398 వేతనంతో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం జరుగడం, రూ 1200, 1500వేతనంతో రెండు సంవత్సరాల అప్రెంటీస్ కాలంతో నియా మకాలు జరపడం ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల జీవన ప్రమాణ స్ధా యిని, ఆత్మగౌరవాన్ని దిగజార్చడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తి పట్ల చులకన భావాన్ని కలిగించే విధంగా ఉండేదన్నారు. పీఆర్‌టీయూ చేప ట్టిన ఉద్యమాలతోనే అప్రెంటీస్ విధానం రద్దు చేయడమే కాకుండా గతంలో పనిచేసిన అప్రెంటీస్ సర్వీస్ కాలాన్ని ప్రభుత్వం రెండు నోష ల్ ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇవన్నీ ఉపాధ్యాయుల చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమల్లోకి తెచ్చి గతంలో పంచాయతీరాజ్ టీచర్లకు ఎంఈవోలుగా పదో న్నతులు ఇప్పించామన్నారు. ఎన్ని సమస్యలను పరిష్కరించినా సమ స్యలు మరోరూపంలో ఉపాధ్యాయ వృత్తిలో వస్తూనే ఉన్నాయన్నారు. అందులో ఒకటి కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం సీపీఎస్‌నీ మొట్టమొ దటిసారి వ్యతిరేకించిన సంఘం పీఆర్‌టీయూ అన్నారు. భవిష్యత్తులో సీపీఎస్ పద్ధతి కోసం పూర్తిస్థాఽయిలో పోరాటం చేస్తుందన్నారు. కేజీబీ వీ టీచర్లకు మినిమం టైమ్స్ కల్పించి, మోడల్‌స్కూల్ టీచర్‌లకు అన్ని రకాల సౌకర్యాల కల్పించడంలో తప్పకుండా కృషి చేస్తామన్నారు. కోర్టులో ఉన్నటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎడ్ల కిషన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి, దుబ్బాక ప్రభాకర్, ఎండీ షఫీ, చీరాల ప్రభాకర్, జిల్లా బాధ్యులు మామిడిశెట్టి మహేష్, జక్కని నవీన్, నల్ల పర్శరాం, ఎర్ర ప్రవీణ్‌కుమార్, పోతుగంటి శ్రీనివాస్, పోన్నాల బాల్‌రెడ్డి, బత్తుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.