ఉపాధి కార్మికుల బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:45 AM
దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ కార్మికుల బకాయిలు రూ.6వేల కోట్లను కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం వెంటనే విడదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు.

సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా ఉపాధిహామీ కార్మికుల బకాయిలు రూ.6వేల కోట్లను కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం వెంటనే విడదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం కార్మిక భవనంలో విలేకరుల సమావేశంలో వేణు మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో దాదాపు లక్ష మంది కార్మికులు పని చేస్తున్నారని గత మూడు నెలలు నుంచి బకాయిలు చెల్లించడం లేదని అన్నారు. ఉపాధిహామీపై ఆధారపడి లక్షలాది కుటుం బాలు జీవనోపాధి పొందుతుండగా, కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధిహామీ కార్మికులకు చెల్లించాల్సిన రూ. 6వేల కోట్లు బకాయిలను ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం విడదల చేయడం లేదని అన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో పురుడు పోసుకున్న ఉపాధిహామీని దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో ఉపాధిహామీని నమ్ముకునే కార్మికులు పని చేస్తున్నారని, 15 రోజుల లోపు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నెలలు తర బడి కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉండడంతో కార్మి కులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావే శంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధిహామీకి కేవలం రూ. 80వేల కోట్లు మాత్రమే కేటాయించి ఉపాధిహామీ కార్మికు లకు కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. పూర్తి స్థాయి లో ఉపాధిహామీ పని కార్మికులకు ఉపాధి కల్పించాలంటే దాదా పు రూ.2లక్షల కోట్లు అవసరమన్నారు. ఉపాధిహామీ గైడ్‌లైన్స్‌ను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రూ.6వేల కోట్ల బకాయిలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విడదల చేయాలని డిమాండ్ చేశారు. తెలం గాణ రాష్ట్రంలో ఉపాధిహామీ కార్మికులు వేసవిలో ఎండ తీవ్ర తను తట్టుకొనే విధంగా అన్ని మౌళిక సదుపాయాలను కల్పించా లని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ నాగరాజు, జిల్లా నాయ కుడు కిషోర్ పాల్గొన్నారు.