Share News

దూదేకుల ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:58 AM

దూదేకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ నూర్‌బాషా దూదేకుల బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అజీముద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దూదేకులు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దూదేకుల ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలి

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 23 (ఆంఽధ్రజ్యోతి): దూదేకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ నూర్‌బాషా దూదేకుల బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అజీముద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దూదేకులు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో దూదేకుల జనాబా ఎంత అనేది స్పష్ఠం చేయాలన్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దూదేకుల ఫెడరేషన్‌ ఏర్పాటు కోసం జీవోను జారీ చేసిందని తెలిపారు. ఆ తరువాత వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని తొక్కిపెట్టి తమకు అన్యాయం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి, 200 కోట్ల నిధులు కేటాయిస్తామన్న స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 12:58 AM