ఒక్క ఓటు మిస్ కావొద్దు.. స్థానిక నాయకత్వానిదే బాధ్యత..
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:12 AM
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకుని మండలంలో 800కు పైగా ఉన్న ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి కాం గ్రెస్‌కు ఓటువేసే విధంగా చూడాలని ఒక్క ఓటు మిస్ కావద్దని.. ఆ పూర్తి బాధ్యత స్థానిక నాయకత్వందే అని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

వేములవాడ టౌన్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకుని మండలంలో 800కు పైగా ఉన్న ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి కాం గ్రెస్‌కు ఓటువేసే విధంగా చూడాలని ఒక్క ఓటు మిస్ కావద్దని.. ఆ పూర్తి బాధ్యత స్థానిక నాయకత్వందే అని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారం గ్రామంలోని ఓ ప్రైవెట్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి హజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లా డుతూ రాష్ట్రంలో గత 15నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించా రు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు రిహ ర్సల్‌లాంటిదన్నారు. మీ గ్రామాల్లో ఉన్న పట్టభద్రుల ను కాంగ్రెస్‌కు ఓటు వేసే బాధ్యత తీసుకోవాలని తెలి పారు. బీజేపి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మొండి చెయ్యి చూపిందని, బీజేపి ఒకప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి అని వేముల వాడకు నిధులు తీసుకువస్తా అని ఏం చేశారని నిలదీ శారు. తాము వేములవాడ ఆలయ అభివృద్దికి, మిడ్ మానేరు నిర్వసితులు, సిరిసిల్ల చేనేత కార్మికుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా కుల గణన చేసి చట్టసభల్లో 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వ కంకణం కట్టు కుంటే బీసీల్లో ముసింలు ఉన్నారని ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. గ్రామాల్లో ఉండే దూదెకుల వాళ్లకు మతపరమైన అంశాలు జోడించి రాజకీయం చేస్తున్నారని వివరించారు. ఢిల్లీలో మాట్లాడటం చేతకా దు కాని మతం పేరుతో రెచ్చగొతున్నారని అన్నారు.
గాంధేయవాదానికి, గాడ్సేకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..
- ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గాంధేయవాదానికి గాడ్సేకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కార్యకర్తలకు సూచించా రు. వేములవాడ మండలంలో నిర్వహించిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి హజరైన ఆయన మాట్లాడు తూ గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉం టూ తెలుగు నేర్చుకుంటున్నాని అన్నారు. ప్రతి 50 మంది పట్టభద్రులకు ఒక్క ఇంచార్జీని నియమించాల ని, నరేందర్‌రెడ్డి విద్యావంతుడని అన్నారు. 30 సంవత్స రాలుగా విద్యాలయాలను నడిపిస్తున్నారని గుర్తు చేశా రు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక విజనరీ సీఎం అని కితాబిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని పెట్ట కుండా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారని అన్నారు. కేసీఆర్, మోదీ, అమిత్‌షా ముగ్గురు ఒక్కటే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రౌడీ రాజకీయాలు చేయడం రాదని, బీజేపీ వారు రౌడీ రాజకీయాలు, మతం పేరుతో రాకీయా లు చేస్తున్నారని విమర్శించారు.
పదేళ్లలో జరగని అభివృద్ధి సంవత్సరంలోనే..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభి వృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంత్సరంలోనే చేసి చూపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావే శానికి హాజరైన ఆయన మాట్లాడుతూ నరేందర్‌రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థుల కు సేవ చేశాడని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ జరిగిందని, మళ్లీ పదేళ్లుగా డీఎస్సీ నిర్వహించ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నిర్వహించన ఘనత కాంగ్రెస్ ప్రభు త్వానిదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్ బలపరిచిన అభ్యర్థి నరేం దర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకే రోజు వెయ్యి కోట్లతో అభివృద్ది చేసిన విజనరీ సీఎం రేవంత్‌రెడ్డి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్‌రెడ్డి, పీసీసీ ప్ర ధానకార్యదర్శి మహేష్, వెలిచాల రాజేందర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య తదితరులు ఉన్నారు.