Share News

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:51 AM

రంగారెడ్డి జిల్లా 9వ అడీషనల్‌ సెషన్స్‌ జడ్జి హరీషపై కరణ్‌ సింగ్‌ అనే నింది తుడు చెప్పు విసరడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహి ష్కరించారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

సిరిసిల్ల క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా 9వ అడీషనల్‌ సెషన్స్‌ జడ్జి హరీషపై కరణ్‌ సింగ్‌ అనే నింది తుడు చెప్పు విసరడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహి ష్కరించారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కోర్టు ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డోర్నాల సంజీవరెడ్డ, కార్యదర్శి వెంకటిలు మాట్లాడుతూ ఫోక్సో కేసులో కరణ్‌ సింగ్‌ అనే నింది తుడికి జీవిత ఖైదు విధించిన జడ్జిపై చెప్పు విసరడం అత్యంత బాధాకరమని, న్యాయమూర్తులపై దాడులకు పాల్పడడం అత్యం త హేయమైన చర్య అన్నారు. న్యాయమూర్తులకు న్యాయవాదు లుగా అండగా ఉంటామని, ఈ చర్యని నిరసిస్తూ విధులను బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి బిట్ల విష్ణు, జాయింట్‌ సెక్రెటరీ నాగరాజు, క్రీడల కార్యదర్శి కిష న్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:51 AM