బీఆర్‌ఎస్ హయాంలోనే వేములవాడ అభివృద్ధి
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:25 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి భారీ ఎ త్తున నిధులు కేటాయించి, స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించారని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి భారీ ఎ త్తున నిధులు కేటాయించి, స్థల సేకరణ చేసి పనులు ప్రారంభించారని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం ఆమె రాజరాజేశ్వ ర స్వామిని దర్శించుకున్నారు. అనంత రం విలేకరులతో మాట్లాడుతూ దేశ ప్ర జలందరూ సుభిక్షంగా ఉండాలని రాజ రాజేశ్వర స్వామిని కోరుకున్నానన్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుంటే పదవులు పోతాయని లేనిపోని అపోహ లతో నాటి ఆంధ్ర పాలకులు బదనాం చేశారన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో సిరిసిల్ల ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రకటించారని, రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల స్థలం, బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధికి ఎకరం సేకరించారని, ఆలయ అభివృద్ధికి 250కోట్ల రూపాయలు కేటాయించా రని గుర్తుచేశారు. ప్రస్తుతం వేములవాడ గుడి చెరువు లో అభివృద్ధి పనులు జరగడం లేదని స్థానికుల ద్వారా తెలిసిందని, ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి పను లు కొనసాగించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభు త్వం మారిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బం దులకు గురిచేస్తున్నారన్నారు. వెంట బీఆర్‌ఎస్ వేముల వాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారా వు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు ఉన్నారు.