Share News

బీజేపీ పాలనలో దళిత సంక్షేమ నిధుల కోత..

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:08 AM

కేంద్రంలోని బీజేపీ పాలనలో దళిత సంక్షేమ నిధులు కోతకు గురవుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ అన్నారు.

బీజేపీ పాలనలో దళిత సంక్షేమ నిధుల కోత..

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ పాలనలో దళిత సంక్షేమ నిధులు కోతకు గురవుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం కార్మిక భవనంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా అనిల్‌ మాట్లాడు తూ బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితు ల రాజ్యాంగ హక్కులపై ఉల్లంఘన జరుగుతోందని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగ భద్రత, దళితులకు భద్రత కల్పించాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించా లని జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించాలని డి మాండ్‌ చేశారు. దీర్ఘకాలిక సామాజిక ఉద్యమం ద్వారా దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను సాధిం చుకోవడం లక్ష్యంగా ఉద్యమించాలన్నారు. సామాజిక గు ర్తింపులేని దళితులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడమే సబ్‌ ప్లాన్‌ ఉద్దేశమన్నారు. ప్రభుత్వాలు ఆ నిధులను దళితుల ప్రత్యేక కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా నిధులను సాధా రణ కార్యక్రమాలకు మళ్లిస్తుందని మండిపడ్డారు. గతంలో దళితులకు అసైన్డ్‌ భూములు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చినవే నన్నారు. 1977లో ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకా రం అసైన్డ్‌ భూములు విక్రయించడం, కొనుగోలు చేయడం, బ్యాంకులలో తనఖా పెట్టడం లేకపోవడం వలన రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా నాయకులు మంద సుదర్శన్‌, ఆర్‌ రవి, నర్సన్న, మల్లేశం, బాబు, కమ లాకర్‌, శ్రీనివాస్‌, నాగరాజు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:08 AM