రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:32 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.
వేములవాడ కల్చరల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రి వేములవాడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కల్యాణకట్టలో తలనీ లాలు సమర్పించుకున్న భక్తులు ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్‌లో భక్తులు శ్రీస్వామి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీపార్వతి దేవి అమ్మవారికి ఓడిబియ్యం పోసి కనుములను సమర్పించుకున్నారు. అనంతరం అనుబంధ ఆల యా ల్లో కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు, బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వినోద్‌రెడ్డి నేతృత్వంలో ఏఈవోలు శ్రావణ్ కుమార్, బ్రహ్మన్నగారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ తిరుపతిరావు, రాజేందర్, నరేందర్, నర్సయ్య, పీఆర్వో శ్రీకాంత్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.