Share News

విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:42 AM

విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించాలి
విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళా మేళా, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను కలెక్టర్‌ సందర్శించారు. కస్తూర్భా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలల, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందమైన వస్తువులను విద్యార్థులు తయారు చేస్తున్నారని, ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అభినందించారు. కార్యక్రమంలో డీఈవో సీహెచ్‌వీఎస్‌ జనార్దన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి, క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:42 AM