Share News

అయోమయం.. ఆందోళన!

ABN , Publish Date - Jan 22 , 2025 | 01:32 AM

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు జాబితాలో తన పేరు ఉందని, ఇక ఇల్లు మంజూరు కావడం ఖాయమని సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు వాలకట్ల భూమమ్మ భావోద్వే గంతో ఆనంద భాష్పాలు రాల్చగా.. ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం సర్వే పూర్తయినా అర్హుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కమాన్‌ పూర్‌ మండలం గొల్లెన లావణ్య మాకు ఇల్లు మం జూరు కాదని అధికారుల కాళ్లు మొక్కింది...

అయోమయం.. ఆందోళన!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు జాబితాలో తన పేరు ఉందని, ఇక ఇల్లు మంజూరు కావడం ఖాయమని సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు వాలకట్ల భూమమ్మ భావోద్వే గంతో ఆనంద భాష్పాలు రాల్చగా.. ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం సర్వే పూర్తయినా అర్హుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కమాన్‌ పూర్‌ మండలం గొల్లెన లావణ్య మాకు ఇల్లు మం జూరు కాదని అధికారుల కాళ్లు మొక్కింది...అధికారులు మంగళవారం నిర్వహించిన గ్రామసభలో చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీకారం చుడుతోంది. ఈ పథకాల కోసం ఇదివరకే ప్రజలు దరఖాస్తు చేసుకోగా, వాటిపై సర్వే నిర్వహించిన ప్రభుత్వం అర్హులైన జాబితాలను రూపొందించింది. ఆ జాబితాలను ప్రజల ముందు ఉంచేందుకు ఈనెల 21, 22, 23 తేదీల్లో గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మంగళవారం జిల్లాలోని 95 గ్రామాల్లో గ్రామసభలు, రామగుండం కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లోని 45 డివిజన్లు, వార్డుల్లో పట్టణ సభలను నిర్వహించారు. ఈ సభల్లో ప్రధానంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల జాబితాలపై పెద్దగా ప్రజల నుంచి అభ్యంతరాలు రాక పోగా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల జాబి తాలపైనే చాలా గ్రామాల్లో అభ్యంతరాలను వెల్లడిం చారు. నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ ఆర్థిక, ఉపాధి, విద్య, కులగణన సర్వేలో గుర్తించిన రేషన్‌ కార్డులు లేని కుటుంబాలు 15,255 ఉన్నట్లు గుర్తించారు. ఆ జాబితాలో ఉన్న వారి గురించి సర్వే చేశారు. గ్రామసభల్లో మాత్రం కొందరి పేర్లను మాత్ర మే చదివారు. ఇది కులగణన సర్వే డేటానా, గతంలో మీ సేవా కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తులా అనే విషయం తెలియడం లేదు. ఒకవేళ కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకున్నా, అందులో రేషన్‌ కార్డు లేదని ఇచ్చిన వారి వివరాలు కూడా జాబితాలో లేకపోవడంతో అందోళన చెందుతున్నారు.

రేషన్‌కార్డులపై నిరసన

ప్రజాపాలన సందర్భంగా రేషన్‌కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిణనలోకి తీసుకోక పోవడంతో సదరు కుటుంబీకులు జాబితాల్లో తమ పేరు లేదని అధికారుల దృష్టికి తీసుకవెళ్లారు. భూములున్న వాళ్లు, సింగరేణి ఉద్యోగులు, వ్యాపారుల పేర్లు జాబితాల్లో వస్తే, కూలీ పనులు చేసుకునే తమ పేర్లు ఎందుకు రాలేదని పలువురు ప్రశ్నించారు. అలాంటి వారిని మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అధికారులు వారికి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లపైనే ఆశలు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,80,664 మంది దరఖాస్తు చేసుకోగా, సర్వే అనంతరం ఇంటి స్థలం లేని వాళ్లు 48 వేల మంది, ఇంటి స్థలం ఉన్న వాళ్లు 58 వేల మంది పేర్లు అర్హుల జాబితాలో వచ్చాయి. మంగళవారం జరిగిన గ్రామ, పట్టణ వార్డు సభల్లో ఆ గ్రామాలు, వార్డులకు సంబంధించిన వార్డు సభల్లో పేర్లను అధికారులు చదివి వినిపించారు. అయితే చాలా మంది తాము అర్హులమే అయినప్పటికీ పేరు జాబి తాలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికా రులు మరోసారి దరఖాస్తు పెట్టుకోవాలని సూచించ డంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని కొందరు అసహనానికి గురయ్యారు. తమ పేరు ఎందుకు లేదని కొన్ని సభల్లో అధికారులను ప్రశ్నించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డుల మంజూరుపైనే ఆశలు పెంచు కున్నారు. జాబితాల్లో పేర్లు ఉన్న వాళ్లు ఈ విడతలో కాకపోయినా మరోవిడతలో ఇల్లు మంజూరు అవు తుందనే భరోసాతో ఉండగా, పేర్లు లేని వాళ్లు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతలో ప్రభుత్వం 3500 ఇళ్లు కేటాయించగా, ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు కేటాయిస్తారనే విషయం ఎవరికి తెలియకుండా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం 1923, రేషన్‌ కార్డుల కోసం 3075 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్‌ బందోబస్తు మధ్య గ్రామ, వార్డు సభలు జరిగాయి.

ఫ్లేక్సీల్లో ఫొటోల లొల్లి

గ్రామసభల్లో పెట్టిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఫొటోలు లేకపోగా, కొన్ని చోట్ల ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్‌లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫొటో పెట్టకపోవడంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫొటోలు పెడతామని ఇన్‌చార్జీ కమిషనర్‌ హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నియోజవర్గంలోని చీమలపేట, గొల్లపల్లి, తదితర గ్రామాల్లో గ్రామసభలకు హాజర య్యారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చీమలపేట, మంథని మున్సిపాలిటీ సభకు హాజరయ్యారు.

Updated Date - Jan 22 , 2025 | 01:32 AM