దంతాల సంరక్షణతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:12 AM
దంతాల సంరక్షణతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజు అన్నారు.

సిరిసిల్ల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : దంతాల సంరక్షణతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజు అన్నారు. దంతాల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ దంత వైద్యులు, విద్యార్థులు 2కే రన్ నిర్వహించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ దంత వైద్యుల దినోత్సవం నేపథ్యంలో డెంటల్ అసోసిసేషన్ జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో ప్రజలకు దంతాలపై అవగాహన కల్పిస్తూ సిరిసిల్ల అంబేద్కర్‌చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐడీఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజు, కార్యదర్శి డాక్టర్ సతీష్, కోశా ధికారి డాక్టర్ శ్యాం, వైద్యులు విజయ్, రాజేందర్, కే గోపి, అన్వేష్, సీహెచ్ సం తోష్, పూర్ణచందర్, శివరామకృష్ణ, ఎ సంతోష్, కీర్తిప్రియ, స్రవంతి, ఓం బ్రహ్మాం, స్నేహా, గీత, ఆకాంక్ష, సంధ్య, రమ్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.