సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధి
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:07 AM
సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధి చెందిందని చొప్పదండి సహకారం సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అన్నారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర సంఘాల అధ్యక్షులు, బ్యాంకు అధికారుల బృందం సోమవారం సందర్శించింది.
చొప్పదండి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధి చెందిందని చొప్పదండి సహకారం సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అన్నారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర సంఘాల అధ్యక్షులు, బ్యాంకు అధికారుల బృందం సోమవారం సందర్శించింది. సంఘం పనితీరు, రైతులకు అందించే సేవలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ వంద శాతం రుణాల రికవరీ చేస్తున్నామని, సంఘం సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని తెలిపారు. సిబ్బందికి, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో పీడీసీ రీసోర్స్ పర్సన్ సత్యనారాయణ, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు కళ్లెం లక్ష్మారెడ్డి, బండారి కొమురయ్య, సిబ్బంది పాల్గొన్నారు.