ఫారెస్ట్ భూములను పరిశీలించిన సీఎఫ్‌వో
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:07 AM
కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీ ప్రభాకర్ గురువారం సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా అటవీ ప్రాంతంలో పర్యటించారు.
గోదావరిఖని, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బీ ప్రభాకర్ గురువారం సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా అటవీ ప్రాంతంలో పర్యటించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి సీహెచ్ శివయ్యతో కలిసి మేడిపల్లి ఓసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ ఇల్లందు క్లబ్‌లో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రభాకర్ సీఏ ల్యాండ్‌లో భాగంగా సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో గల మేడిపల్లి ఉపరితల గనికి సంబందించిన మ్యాపులను పరిశీలించారు. తదనంతరం మేడిపల్లి ఉపరితల గనిని సందర్శించి మేడిపల్లి వ్యూ పాయింట్ వద్ద నుండి క్వారీ ఓవర్ బర్డెన్ డంపులపైన పెంచిన అటవీ ఏరియాను పరిశీలించారు. కొత్తగూడెంలో వీకే ఓసీపీ ప్రాజెక్టు కోసం మేడిపల్లి ఓసీపీ వద్ద ప్రతిపాదించిన ఫారెస్ట్ ల్యాండ్‌లను పరిశిలించారు. మేడిపల్లి ఓసీపీ పరిసరాలలో ఆటవిని విస్తారంగా ఏవిధంగా అభివృద్ధి చేయాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం గోపాల్ సింగ్, ఎస్టేట్ డీజీఎం కుమార స్వామి, ఏరియా ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఫారెస్ట్ అధికారి కర్ణ, ఎస్టేట్ మేనేజర్ సాంబ శివరావు, మేనేజర్ మల్లిఖార్జున్ యాదవ్ పాల్గొన్నారు.