Share News

బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:10 AM

బీజేపీని గెలిపించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ చేస్తోందని ఎమ్మెల్సీ, పట్టభద్రుల కరీంనగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎన్ని కల జిల్లా ఇన్‌చార్జి బల్మూరి వెంకటి అన్నారు.

బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : బీజేపీని గెలిపించే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ చేస్తోందని ఎమ్మెల్సీ, పట్టభద్రుల కరీంనగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎన్ని కల జిల్లా ఇన్‌చార్జి బల్మూరి వెంకటి అన్నారు. బుధ వారంరాత్రి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియో జకవర్గం ఇంచార్జి కేకే మహేందరెడ్డి అధ్యక్షతన సిరి సిల్ల పట్టణ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో విస్తృతంగా ప్రచా రం చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్తి నరేందర్‌రెడ్డిని బారీ మెజార్టితో గెలిపించాలన్నారు. సమావేశంలో గ్రంథాల యం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ వెల్ముల స్వరూపతిరపతిరెడ్డి, టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు సూర దేవరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మార్కెట్‌ కమిటి డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 01:10 AM