కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:51 AM
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో గెలవలేమని తెలిసి బీజేపీని గెలిపించి కాంగ్రెస్‌ను బలహీన పర్చాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదని ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్యనా యక్ అన్నారు.

సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మె ల్సీ ఎన్నికల్లో గెలవలేమని తెలిసి బీజేపీని గెలిపించి కాంగ్రెస్‌ను బలహీన పర్చాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదని ట్రైకాన్ చైర్మన్ బెల్లయ్యనా యక్ అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం జిల్లా కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి గెలవడం వల్ల కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం ఉందని, అసెంబ్లీలో చేసిన తీ ర్మానాలన్నీ ఆమోదం పొందుతాయని ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయి అమలుచేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడం కోసం బీజే పీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపిం చారు. కాంగ్రెస్‌ను ఓడిస్తే ప్రభుత్వం ఏం చేయడం లేదంటూ కేటీఆర్ ప్రచారం చేస్తారన్నారు. పది సంవ త్సరాల కాలం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన బీఆర్ ఎస్ ఒకవైపు, పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేష న్లు ఇవ్వకుండా ఖాళీగా ఉన్న దాదాపు 65లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆరోపించారు. తెలంగాణ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు స్పష్టమైన పద్ధతి లో పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 56 వేల ఉద్యోగాలను భర్తీచేసిందని, మరో నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న ఖాలీలను భర్తీ చేస్తుందన్నారు. పట్టభ ద్రుల సమస్యలను చట్టసభలో ప్రస్తావిం చడం నరేందర్‌రెడ్డిని గెలిపించడం వల్లే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు, మేధావులు, ప్రజాస్వా మ్యవాదులు, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపున కు కృషి చేయాలన్నారు. ఈ సమావేశం లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, కాంగ్రెస్ రాష్ట అధికార ప్రతినిధి కే చక్రధర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్య క్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సిలర్లు వేముల రవి, కుడికాల రవికుమార్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్, నా యకులు తదితరులు పాల్గొన్నారు.