Share News

ఆధిక్యంలో బీజేపీ

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:50 AM

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది.

ఆధిక్యంలో బీజేపీ

కరీంనగర్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య నువ్వా..నేనా అన్నట్లుగా హోరాహోరీగా ఎన్నికలు జరుగగా ఫలితాలు మాత్రం బీజేపీకే అనుకూలంగా వస్తున్నాయి. బీసీ వాదం బలంగా వీయడంతో గట్టి పోటీ ఇచ్చి రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచే అవకాశాలుంటాయని భావించిన బీఎస్పీ అభ్యర్థి మూడో స్థానానికే పరిమిత మయ్యారు. మొత్తం 11 రౌండ్లలో ఓట్లను లెక్కించనుండగా రాత్రి 12 గంటల వరకు ఆరు రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. ఆరు రౌండ్లు ముగిసే వరకు బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వి నరేందర్‌రెడ్డి కంటే 7,118 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. మొదటి ప్రాధాన్య ఓట్లు బుధవారం మధ్యాహ్నం వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి ప్రాధాన్య ఓట్లతో కోటా ఓట్లు వచ్చే అవకాశాలు లేక పోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే గెలుపు ఖాయమవుతుందని అంచనావేస్తున్నారు.

ఫ ఒక్కో రౌండ్‌లో 21 వేల ఓట్లు

ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభం కాగా ఆరోజంతా చెల్లని ఓట్లను విభజించి బండిల్స్‌ కట్టడానికే సరిపోయింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 ఓట్లు పోల్‌ కాగా వాటిలో 28,000 ఓట్లు చెల్లుబాటు కానీ ఓట్లుగా నిర్ధారించారు. మిగిలిన 2,24,100 ఓట్లను 21 టేబుళ్లపై ఒక్కో టేబుల్‌కు వెయ్యి చొప్పున ఒక రౌండ్‌లో 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. పూర్తయిన ఆకె రౌండ్లలో 1,26,000 ఓట్లను లెక్కించారు. మరో 98,000 ఓట్లకుపైగా లెక్కించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి 7,118 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి 45,822 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి వి నరేందర్‌రెడ్డికి ఆకె రౌండ్లలో 38,704 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 32,110 ఓట్లు వచ్చాయి. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి సర్దార్‌ రవీందర్‌సింగ్‌కు 799, స్వతంత్ర అభ్యర్థులు ముస్తాక్‌ అలీకి 1,208, యాదగిరి శేఖర్‌రావుకు 1917 ఓట్లు వచ్చా యి. ఇంకా ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగాల్సి ఉన్నది. తుది ఫలితం బుధవారం వెలువడే అవకాశ మున్నది. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు తలపడి పోటీని ముక్కోణపు పోటీగా మార్చి అదే స్థాయిలో సాధించడంతో మొదటి ప్రాఽధాన్యం ఓటుతోనే ఎవరు గెలిచే అవకాశం లేదు. దీంతో ఎలిమినేషన్‌ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఏర్పడనున్నది.

ఫ ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యం

ఐదు రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగగా ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 205 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్‌లో ఆయనకు 7,060 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,855 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 5,548 ఓట్లు సాధించారు.

ఫ కీలకంగా రెండో ప్రాధాన్య ఓట్లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో రెండో ప్రాధాన్య ఓట్లు కీలకంగా మారుతున్నాయి. పోటీ హోరాహోరీగా సాగడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ముగ్గురూ భారీగానే ఓట్లు సాధిస్తున్నారు. దీంతో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఏ ఒక్కరికీ కోటా ఓట్లు సాధించే అవకాశం లేక పోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు వారి అనుచరులు ఆశలు పెట్టుకు న్నారు. ఎవరికి వారు తమకు రెండో ప్రాధాన్య ఓట్లు అత్యఽ దికంగా వచ్చాయని అంచనా వేసుకుంటున్నారు. త క్కువ ఓ ట్లు వచ్చిన ఒకొక్కరినీ ఎలిమినేట్‌ చేసుకుంటూ వచ్చే సరికి మొదటి మూడు స్థానాల్లో మార్పు వస్త్తుందని, దీంతో తమ అభ్యర్థే ముందు స్థానంలో నిలుస్తారని అంచ నాలు వేసుకుంటున్నారు. ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉండ డంతో మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి ఎలిమినేట్‌ అ య్యే వరకు ఎవరికీ కోటా ఓట్లు లభించే అవకాశాలు కనిపిం చడం లేదు. మూడో స్థానంలో నిలిచే అభ్యర్థికి తొలి ప్రాధా న్య ఓటు వేసిన ఓటర్లలో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి ఎక్కువ వేస్తారో వారే విజేతగా నిలిచే అవకాశం ఉంది.

Updated Date - Mar 05 , 2025 | 01:50 AM