Share News

ఉన్నత విద్య కాషాయీకరణకు బీజేపీ ప్రభుత్వం కుట్ర..

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:54 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నత విద్యను కాషాయీకరణ చేసే కుట్రలు చేస్తోందని విద్యా ర్థులు తిప్పికొట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు.

ఉన్నత విద్య కాషాయీకరణకు బీజేపీ ప్రభుత్వం కుట్ర..

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నత విద్యను కాషాయీకరణ చేసే కుట్రలు చేస్తోందని విద్యా ర్థులు తిప్పికొట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్ట ణం కార్మిక భవనంలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమా వేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి మం ద అనిల్‌, జిల్లా అధ్యక్షుడు రాకేష్‌తోపాటు ఆరు మండలాల నాయకులు పెద్ద సంఖ్యలో ఏఐఎస్‌ ఎఫ్‌లో చేరారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర జాతీయ నూతన విద్యావిధానం-2022 పేరుతో మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూ జీసీ) 2025 జారీ చేసిన ముసాయిదా డ్రాఫ్ట్‌ ఇది ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కు ట్రలను చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం అంటే విద్యారంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉందో విద్యార్థులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థులు హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 10 శాతం ని ధులు కేటాయింపులు చేయకుండా, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభు త్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. నూత న విద్యావిధానం, విశ్వవిద్యాలయాల ఫండ్‌, ఫె లోషిఫ్స్‌ ఇవ్వకపోవడం, ఖాలీలు భర్తీ చేయకుం డా ఉండడం, యూనివర్సీటీలలో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడం కోసమే యూ జీసీ 2025 సవరించిన నియమాలు వైస్‌ ఛాన్స లర్ల ఎంపికలో రాష్ట్ర గవర్నర్లకు ఎక్కువ అధికా రాలను ఇస్తున్నాయని ఆరోపించారు. ఇది అ త్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశా రు. కేంద్ర ప్రభుత్వం తక్షణమై జాతీయ నూత న విద్యా విధానాన్ని ఉపసంహరించుకొని యూ జీసీ 2025 ముసాయిదా మార్గదర్శకాలను వెన క్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌బకాయిలను విడు దల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెల గాటం ఆడుతోందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, నాయకులు కడారి రాములు పంతం రవి, మండ సుదర్శన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మంది అనిల్‌కుమార్‌, కుర్ర రాకేష్‌, పెండల ఆదిత్య, వికృతి అరవింద్‌, పల్లి శ్రీకాంత్‌, పుట్టి స్వాత్విక్‌, దొంతి అరుణ్‌, పవన్‌, సన్నీ, అభిలాష్‌, రాహుల్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:54 AM