Share News

త్వరలో బీజేపీ జిల్లా కమిటీ

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:00 AM

సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించిన బీజేపీ జిల్లాలోని 21 మండలాలకు అధ్యక్షులను ప్రకటించింది. సంక్రాంతి నాటికి జిల్లా కమిటీని ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది.

త్వరలో బీజేపీ జిల్లా కమిటీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించిన బీజేపీ జిల్లాలోని 21 మండలాలకు అధ్యక్షులను ప్రకటించింది. సంక్రాంతి నాటికి జిల్లా కమిటీని ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది. మండల కమిటీలకు అధ్యక్షులను ఎంపిక చేసేందుకు సీనియర్‌ నేతలతో త్రిసభ్య కమిటీని నియమించింది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమల ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు కన్నెబోయిన ఓదెలు ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ మండల శాఖ అధ్యక్షులతో పాటు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులను నియమించింది. ఈ నెల 15లోగా జిల్లా కమిటీని ప్రకటించనున్న నేపథ్యంలో 21 మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. త్వరలో మండల కమిటీలతోపాటు జిల్లా కమిటీని నియమించనున్నారు. జిల్లాలో పార్టీ పదవులు పొందే విషయంలో నేతల్లో పోటీ నెలకొన్నా ఎవరు అసంతృప్తికి లోనుకావద్దని బీజేపీ పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయని నాయకులు తెలిపారు.

ఫ ఐదు జోన్లుగా కరీంనగర్‌ కార్పొరేషన్‌

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఐదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌కు అధ్యక్షుడితోపాటు కార్యవర్గాలను నియమించనున్నారు. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను మండలాలుగానే పార్టీ పరిగణిస్తున్నది. జిల్లాలోని కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వస్తూ ఇతర జిల్లాల్లో ఉన్న మండలాలను ఈ జిల్లా మండలాలుగానే పార్టీ పరిగణిస్తున్నది. జిల్లావ్యాప్తంగా పార్టీ గుర్తించిన 28 మండలాలకు గాను 21 మండలాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. జిల్లా పరిధిలో గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ సాధించిన ఓట్లలో సగం మేరకు సభ్యత్వాలు సేకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 2.2 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్చుకున్నారు. జిల్లాలోని 28 పార్టీ మండలాల్లో 1,338 బూత్‌లు ఉన్నాయి. 21 మండలాల్లో బూత్‌ కమిటీలు పూర్తి చేసిఅధ్యక్షుల పేర్లను వెల్లడించారు. అత్యధిక గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పదవులను, జడ్పీటీసీ పదవులను కైవసం చేసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని ఆ పార్టీ పథక రచన చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 2.2 లక్షల మందిని సభ్యులుగా చేర్పించారు. ప్రస్తుతం మండల అధ్యక్షుల నియామకం పూర్తవడంతో క్షేత్ర స్థాయికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని బీజీపీ నాయకులు భావిస్తున్నారు.

ఫ బీజేపీమండల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు వీరే

శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు మండల అధ్యక్షులు, కౌన్సిల్‌ సభ్యుల పేర్లను ప్రకటించారు. కరీంనగర్‌ రూరల్‌ మాడిశెట్టి సంతోష్‌కుమార్‌, కొత్తపల్లి జోన్‌ ముతూనూరి హరిష్‌, కొత్తపల్లి రూరల్‌ కుంట తిరుపతి, కరీంనగర్‌ సౌత్‌జోన్‌ బండారు గాయత్రి, మానకొండూర్‌ కంది రాజిరెడ్డి, శంకపట్నం ఏనుగుల అనిల్‌, బెజ్జంకి మండలానికి కొలిపాక రాజును ఎంపిక చేశారు. ఇల్లంతకుంట మండలానికి భూమల అనిల్‌, గన్నేరువరం తిప్పర్తి నికేష్‌, హుజూరాబాద్‌ టౌన్‌ తుర్పాటి రాజు, జమ్మికుంట టౌన్‌ కోలకాని రాజు (రవిప్రసాద్‌), ఇల్లందకుంట మండలానికి బైరెడ్డి రమణారెడ్డిని నియమించారు. వీణవంక మండలానికి బత్తిని నరేష్‌గౌడ్‌, కమలాపూర్‌ ర్యాకం శ్రీనివాస్‌, చొప్పదండి టౌన్‌ చిల్ల శ్రవన్‌కుమార్‌, చొప్పదండి రూరల్‌ మొగిలి మహేష్‌, రామడుగు మోడి రవీందర్‌, గంగాధర పంజాల ప్రశాంత్‌గౌడ్‌, బోయినపల్లి ఈదపల్లి పరుశురాం, మల్యాల గాజుల మల్లేశం, కొడిమ్యాల మండలానికి బండ నరిసంహారెడ్డిని ఎంపిక చేశారు.

జిల్లా కౌన్సిల్‌ సభ్యులుగా పండి శ్రీనివాస్‌ యాదవ్‌, చంద్రశేఖర్‌ వేముల, వేముల అనిల్‌కుమార్‌, అడిచర్ల రాజు, అప్పాని తిరుపతి దాసారపు నరేందర్‌, బుర్ర మల్లేశం, బత్తిని సాయిగౌడ్‌, అరికంతాపు అంజిరెడ్డి, రావుల వేణు, దొంతుల రాజకుమార్‌, గుత్తికొండ రాంబాబు, దాసరి భాస్కర్‌, బండారి సుధాకర్‌, గుండేటి శివకుమార్‌, గొల్ల గట్టయ్య, ఉప్పు శ్రీనివాస్‌, సదాల భాస్కర్‌, ఊదరి నరింహాచారి, సంగాని రవి, చల్ల శ్రీనివాస్‌రెడ్డి పేర్లను ప్రకటించారు.

Updated Date - Jan 12 , 2025 | 01:00 AM