ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:03 AM
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 75 శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా ఆదేశించారు.

సిరిసిల్ల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 75 శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా ఆదేశించారు. గురువారం తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో గడ్డి, పిచ్చిమొక్కలు పెరగ డంతో వాటిని తొలగించాలని ఎంపీవోను ఆదేశించారు. పరిశుభ్రంగా ఉండే లా సూచనలు చేశారు. సీసీ కెమెరాలను మరమ్మతు చేయించి వినియోగం లోకి తీసుకరావాలన్నారు. కేంద్రంలోని ఓపీ రిజిస్టర్‌లు, ల్యాబ్, ఫార్మసీ గదు లను పరిశీలించారు. పరీక్షలకు వస్తున్న గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ హాఫీజాబేగం తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ బడిలోనే చదవాలి..
గ్రామాల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. గురువారం తంగళ్లపల్లి మండలం చీర్లవంచ పరిధిలోని తెనుగువాని పల్లెలో మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠాలు చెబుతున్న తీరును పరిశీలించడంతో పాటు స్వయంగా పిల్లలకు పాఠాలు చెప్పారు. పాఠశాల ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో రోడ్డు ఏప్ప టికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కుంటున్న ఇబ్బం దుల గురించి ఆరాతీశారు. వాటర్ ఫ్యూరిపైర్, ఫ్యాన్లు మరమ్మతు చేయించి అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. కిచెన్‌షెడ్ నిర్మాణానికి నిధు లు మంజూరుచేస్తానని తెలిపారు. పాఠశాలకు మంచి భవనం ఉందని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. గ్రామలోని పిల్లలు పాఠశాలలో చదివేలా చూడాలని, పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన, సాంకేతికతతో కూడిన బోధనపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట ప్రధానోపా ధ్యాయుడు కార్తీలాల్ ఉన్నారు.