ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:39 AM
ప్రజలకు అందు బాటులో ఉంటూ మరింత మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్
పెగడపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందు బాటులో ఉంటూ మరింత మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. పెగడపల్లి మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డిప్యూ టీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను, ఓపీ, ల్యాబ్ తదితర సేవలను పరిశీలించారు. అసంక్రమి త వ్యాధులైన బీపీ, మధుమేహం లాంటి వ్యాధుల సర్వే నిర్వహించాల ని, ప్రజలకు అవగాహన కల్పిం చాలని సూచించారు. చర్మ వ్యాధులపై అప్రమత్తం గా ఉండాలని, ఆరోగ్య పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా 12 మంది చర్మవ్యాధి గ్రస్తులను పరిశీలించి మందులు పంపిణీ చేశారు. మండల వైద్యాధికారి నరేష్, సీహెచ్‌వో మహేందర్‌రెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.