వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు మేలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:03 AM
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు మేలు జరుగుతుందని, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చని మానకొండూర్ తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు. మానకొండూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల స్థాయి వైజ్ఙానిక ప్రదర్శనను మంగళవారం నిర్వహించారు.

మానకొండూర్, పిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు మేలు జరుగుతుందని, వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయవచ్చని మానకొండూర్ తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు. మానకొండూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మండల స్థాయి వైజ్ఙానిక ప్రదర్శనను మంగళవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఉపాద్యాయులు తయారు చేసిన బోధన అభ్యసన పరికరాలు, కళాకృతుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు వివిద రకాల వస్తువులను తయారు చేయడం అభినందనీయమన్నారు. స్కూల్ కాంప్లెక్స్ స్లాయిలో మానకొండూర్ పరిధిలో శ్రీనివాస్‌నగర్ ప్రథమ, లలితాపూర్ పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచాయి. గంగిపల్లి పరిధిలో దేవంపల్లి ప్రథమ, గట్టుదుద్దెనపల్లి ద్వితీయ, వెల్ది పరిధిలో లింగాపూర్ ప్రథమ, వెల్ది ద్వితీయ, పచ్చునూర్ పరిధిలో యాదవనగర్ ప్రథమ, పోచంపల్లి పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి. మండల స్థాయిలో యదవనగర్ ప్రథమ, దేవంపల్లి ద్వితీయ, లింగాపూర్ తృతీయ స్థానంలో నిలిచాయి. ఆర్ట్స్, క్రాప్స్ట్ విభాగంలో కేజీబీవీ ప్రథమ, మనకొండూర్ బాలికల పాఠశాల ద్వితీయ స్థానం, టీఎల్‌ఎం విభాగంలో పోచంపల్లి ప్రథమ, గట్టుదుద్దెనపల్లి ద్వితీయ స్థానం సాధించాయి. ఉన్నత పాఠశాలల విభాగంలో చెంజర్ల ప్రథమ స్థానం, అన్నారం ద్వితీయ స్థానం సాధించాయి. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంఈవో మధుసుదనాచారి పాల్గొన్నారు.