Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:37 AM

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధికా జైశ్వాల్‌ కోరారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సిరిసిల్ల రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధికా జైశ్వాల్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్‌జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మనోన్యాయ లీగ ల్‌ హెడ్‌ క్లినిక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లా డుతూ విద్యార్థినులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కష్టప డి చదివి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా న్యాయ సల హాలు కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. విద్యార్థులు, వారికి ఉన్న హక్కు చట్టాలతో పాటు మహిళల కోసం ప్రత్యేకం ఏర్పాటుచేసిన చట్టాలను తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌, లీగల్‌ సెల్‌ సభ్యులు అడెపు వేణు, కుంట శ్రీనివాస్‌, నర్మెట రమేష్‌, ప్రధానోపాధ్యా యురాలు లోకిని శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:37 AM