స్వర మాంత్రికుడు సలీంకు డాక్టరేట్ ప్రదానం
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:50 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరమాంత్రికుడు మహ్మద్ సలీంకు శనివారం తమిళనాడు హోనూర్‌లోని ఆసియా ఇంటర్నేష నల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్శిటీ గౌరవ డాక్ట రేట్ పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానిం చింది.

సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్వరమాంత్రికుడు మహ్మద్ సలీంకు శనివారం తమిళనాడు హోనూర్‌లోని ఆసియా ఇంటర్నేష నల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్శిటీ గౌరవ డాక్ట రేట్ పురస్కారాన్ని అందించి ఘనంగా సన్మానిం చింది. 50 సంవత్సరాలుగా ప్రచార రంగంలో కొనసాగుతూ సామాజిక కార్యక్రమాలను చేప డుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్న సలీం సేవలను గుర్తించిన ఆసియా ఇంటర్నేష నల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్శిటీ గౌరవ డాక్ట రేట్ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. ఐదు దశాబ్దాలుగా సలీం సిరిసిల్ల పట్టణం కేంద్రంగా అనేక వ్యాపార, ప్రచార ప్రకటనలు, రాజకీయ, సామాజిక హిత చైతన్య ప్రకటనలకు స్వరాన్ని అందించారు. తెలుగువారి ఇష్ట గాయకుడు ఘంటసాల కల్చరల్ అకాడమి పేరుతో సలీం ఘంటసాల పాటలను తన వ్యాఖ్యానంతో విడుదల చేసి ప్రశంసలు అందుకున్నా రు. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి సలీం విడు దల చేసిన ప్రకటనలో తనకు దక్కిన పురస్కారం సిరిసిల్ల ప్రజలందరికి దక్కిన పురస్కారంగా భావిస్తు న్నానని పేర్కొన్నారు. తనకు డాక్టరేట్ రావడానికి సహకరించిన లంబోధర కల్చరల్ అకాడమి అశోక్, సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.