Share News

నూతన పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:41 AM

గణతంత్ర దినో త్సవం రోజున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డుల జారీ పథ కాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందు కు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

నూతన పథకాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి

సిరిసిల్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినో త్సవం రోజున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డుల జారీ పథ కాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందు కు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. గణతంత్రం రోజు నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్లపై శనివారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు ముందుగా అభినందనలు తెలిపారు. ప్రతి మండలంలో 250నుంచి 400వరకు ఇండ్లు ఉన్న గ్రామా లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుం టూ గ్రామాలను ఎంపిక చేయాలని అన్నారు. ప్రజా పాలన ప్రారంభించే గ్రామాల జాబితా, గ్రామాలలో నాలుగు పథకాల లబ్ధిదారుల వివరాలను నిర్ణీత నమూ నాలలో పంపించాలని అన్నారు. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పథకాలను అధికారికంగా ప్రారంభించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలని, పథకాలకు సంబంధించి సదరు గ్రామాల్లో అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని అన్నా రు. నూతన పథకాలలో అర్హులు మాత్రమే జాబితాలో ఉండేలా అప్రమత్తంగా ఉండాలని, గ్రామసభలలో స్వీక రించిన నూతన దరఖాస్తులను సైతం పరిశీలించి అర్హు లు ఉంటే జాబితాలో పొందుపర్చాలని అన్నారు. నూత న రేషన్‌కార్డుల జారీని తహసీల్దార్‌ బృందం, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎంపీడీవో బృందం, రైతు భరోసా జాబితాను మండల వ్యవసాయ అధికారి బృందం, ఇం దిరమ్మ రైతు భరోసా జాబితాను ఏపీవో బృందం పరిశీ లించి, అర్హులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, పథకాలకు సంబం ధించి లబ్ధిదారులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా చూడాలని, లబ్ధిదారుల వివరాలను గ్రామాల్లో ప్రదర్శిం చాలని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రతి గ్రా మంలో మంచి ఆడియో, వీడియో ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రదర్శించాలన్నారు. పథకాలకు సంబంధించిన మార్గద ర్శకాలను ప్రజలకు మరోసారి వివరించాలని, ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయా లని, అనంతరం ప్రజాప్రతినిధులు తమ సందేశాలు వినిపించాలని, కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధుల ను, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ లను ఆహ్వానించాలని పేర్కొన్నారు. పథకాల ప్రారంభం కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభ లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపి, క్షేత్రస్థాయి విచారణ చేయాలని, దరఖాస్తులలో అర్హులు ఉంటే పేర్లు నమోదు చేసి పథకాలను సంబం ధిత లబ్ధిదారులకు వర్తింపజేయాలని అన్నారు. ప్రతి మండలంలో పథకాల ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎటువంటి గందరగోళం జరిగేందుకు వీలు లేదని, ప్రభుత్వ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడు వరకు చేరుతాయనే విశ్వాసాన్ని ప్రజలలో కల్పించాలని అన్నారు.

జిల్లాలో 40,360 దరఖాస్తులు...

జిల్లాలో నాలుగు పథకాల గ్రామ సభల్లో 40360 దరఖాస్తు లు వచ్చాయని కలెక్టర్‌ సందీప్‌కు మార్‌ ఝా కాన్ఫరెన్స్‌లో వివరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 మున్సిపల్‌ వార్డు సభలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. నూత నంగా రేషన్‌ కార్డులకు 16505, ఇందిరమ్మ ఇండ్లకు 14542, రైతు భరోసాకు 141, ఇందిరమ్మ ఆత్మీయభరోసాకు 9172 దర ఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ఆదేశాల మేరకు పక డ్బందీగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, డీఆర్‌డీఏ శేషాద్రి, ఎస్‌డీసీ రాధాబాయి, వ్యవసాయ అధికారి అప్జల్‌భేగం, ఉద్యానవన శాఖ అధికారి లత, పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మీ, మేనేజర్‌ రజిత, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్‌, గృహనిర్మాణ శాఖ చెన్నయ్య, జిల్లా సంక్షే మ అధికారి లక్ష్మీరాజం, జడ్పీ సీఈవో వినోద్‌, డీసీవో రామకృష్ణ, మైనింగ్‌ ఏడీ క్రాంతి, డీపీఆర్వో శ్రీధర్‌, తది తరులు ఉన్నారు.

ఎంపిక చేసిన గ్రామాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు పథకాలను లాంఛ నంగా ప్రారంభించడానికి ఎంపిక చేసిన గ్రామాలు ఇలా ఉన్నాయి. బోయినపల్లి మండలం అనంతపల్లి, చందుర్తి మండలంలో కొత్తపేట, ఇల్లంతకుంట మండ లం సిరికొండ, గంభీరావుపేట మండలంలో దమ్మన్న పేట, కోనరావుపేట మండలంలో గొల్లపల్లి, ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌, రుద్రంగి మండలంలో గాయిది గుట్ట తండా, తంగళ్లపల్లి మండలం రాళ్లపేట, వీర్నపల్లి మండలంలో లాల్‌సింగ్‌ తండా, వేములవాడ రూరల్‌ మండలంలో వెంకటాయపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో పెద్దూర్‌లో నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులకు ప్రొసీడిం గ్‌లు అందించనున్నారు.

Updated Date - Jan 26 , 2025 | 12:41 AM