Share News

అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రం సీజ్‌

ABN , Publish Date - Feb 21 , 2025 | 02:37 AM

వేముల వాడ మండలం అగ్రహారం గ్రామంలోని కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ పాల శీతలీకరణ కేంద్రాన్ని గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌ ఆధ్వర్యంలో అధికారులు సీజ్‌ చేశారు.

అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రం సీజ్‌

వేములవాడ టౌన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ మండలం అగ్రహారం గ్రామంలోని కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ పాల శీతలీకరణ కేంద్రాన్ని గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌ ఆధ్వర్యంలో అధికారులు సీజ్‌ చేశారు. 2003 సంవత్సరం నుంచి పాల శీతలీకరణ కేంద్రం పని చేస్తోందని, కనీసం ఇప్పటివరకు గ్రామపంచాయతీ అనుమతులు కానీ, ఇండస్ట్రియల్‌ అనుమ తులు కానీ లేకపోవడంతో పలుమార్లు తమ సిబ్బంది నోటీసు లు ఇచ్చినా సంబంధిత కంపెనీ సభ్యులు నోటీసులను తిరస్క రించారని అన్నారు. దీంతో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, ఇండస్ర్టీయల్‌ ఏడీ ఆధ్వర్యం లో డెయిరీని సీజ్‌ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేయడంతో రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్‌ దగ్గరుండి సీజ్‌ను తొలగింపజేశారు.

రోడ్డుపై బైఠాయించిన పాడి రైతులు..

అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్‌ చేసిన విషయం తెలుసుకున్న రైతులు ముందుగా డెయిరీ వద్దకు చేరుకుని పాల శీతలీకరణ కేంద్రం ఎదుట అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రం పరిధిలో 145 గ్రామాలకు సంబంధించి 20 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, నిత్యం 18 వేల నుంచి 20 వేల లీటర్ల పాలు అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రానికి రైతులు తరలిస్తారని డెయిరీని సీజ్‌ చేస్తే పాడి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డెయిరీ సీజ్‌ను తొలగించాలని గ్రామపంచాయతీ, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, పోలీసులతో పాడి రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారులు స్పందించకపోవడంతో కరీం నగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపైన బైఠాయించారు. సుమారుగా రెండు గంటలపాటు రోడ్డుపైన బైఠాయించి కలెక్టర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసులు తరలివచ్చి రైతులను నచ్చజెప్పేందుకు ప్రయ త్నించారు. వినకపోవడంతో రైతులను బలవంతంగా రోడ్డుపై నుంచి తొలగించారు. కాగా గురువారం రాత్రి పాడి రైతులు తమ పాలను తీసుకువెళ్లగా కేంద్రాలు తెరిచి లేకపోవడంతో రైతులు జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ధర్నాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వేముల వాడ మండలం అనుపురం గ్రామంలోని పాడి రైతులు పాల కేంద్రం ఎదుట పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.

సీజ్‌ తొలగింపు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం పాల శీత లీకరణ కేంద్రాన్ని అధికారులు గురువారం సీజ్‌ చేశారు. అయి తే జిల్లా వ్యాప్తంగా పాడి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో కలెక్టర్‌తో మాట్లాడి పాల శీతలీకరణ కేంద్రం సీజ్‌ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో దగ్గరుం డి తొలగించి తిరిగి ప్రారంభించారు. శీతలీకరణ కేంద్రానికి సంబంధించి అనుమతులకు సమయం ఇచ్చి రైతుల ప్రయోజ నాల దృష్టిలో ఉంచుకుని తిరిగి ప్రారంభించాలని కోరడంతోనే సీజ్‌ను తొలగించామని, ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభా కర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభుత్వ విప్‌ తెలిపారు.

Updated Date - Feb 21 , 2025 | 02:38 AM