Share News

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:06 AM

న్యాయవాదు లకు రక్షణ కల్పించాలని వేములవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

వేములవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాదు లకు రక్షణ కల్పించాలని వేములవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్‌ చేశారు. వరం గల్‌కు చెందిన న్యాయవాది గంధం శివపై పోలీసులు దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ గురువారం వేములవాడలోని కోర్టులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లా డుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగు తున్నాయన్నారు. పోలీసులు సైతం న్యాయవాదులపై అక్ర మంగా కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వరంగల్‌లో న్యాయవాదిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అవధూత రజినీకాంత్‌, సీనియర్‌ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, రేగుల దేవేందర్‌, విద్యాసాగర్‌ రావు, వేము ల సుధాకర్‌ రెడ్డి, పొత్తూరు అనిల్‌ కుమార్‌, పెంట రాజ్‌ కుమార్‌, నక్క దివాకర్‌, గొంటి శంకర్‌, పిల్లి మధు, జెట్టి శేఖర్‌, బొజ్జ మహేందర్‌, కాతుబండ నర్సింగరావు, గుండా రవి, మాదాసు దేవయ్య, సరిత, మమత, నయమా నాసారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 01:06 AM