భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:12 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభు త్వ యంత్రాంగం సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండాచర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌లు పేర్కొ న్నారు.
వేములవాడ కల్చరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్ర జ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభు త్వ యంత్రాంగం సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండాచర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్‌మహాజన్‌లు పేర్కొ న్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్ల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయాధికారులు పలు సూచనలు చేశారు. క్యూలైన్‌లు, కోడె మొక్కు లైన్, ధర్మగుండం, ప్రధాన ద్వారం, ప్రసాదం తయరీ కేంద్రాన్ని, అంబేద్కర్ కూడలిని పరిశీలించారు. ఎక్కు వ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తరుపున పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. వారి వెంట ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహ సీల్దార్ మహేష్, సీఐ వీరప్రసాద్ తదితరులు ఉన్నారు.