భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయాలి
ABN , Publish Date - Mar 04 , 2025 | 01:02 AM
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్రమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు.
భగత్‌నగర్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్రమైన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌యూనియన్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగేబిల్డింగ్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను విజయవతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కన్నం సదానందం, అనిశెట్టి చంద్రయ్య, జంగం కొమురయ్య, పూదరి ఓదయ్య, ఎండీ ఖాజాపాషా, గోదారి లక్ష్మణ్, గడ్డి ఐలయ్య, గుండవేని ప్రవీణ్, నరేందర్ పాల్గొన్నారు.