Share News

Harish Rao: మేం ప్రశ్నించాకే కల్వకుర్తి నీటి విడుదల

ABN , Publish Date - Jul 09 , 2025 | 04:25 AM

సాగునీరందక అవస్థపడుతున్న లక్షలాదిమంది రైతులతో తరలివచ్చి మోటార్లు ఆన్‌ చేస్తామంటేగాని ప్రభుత్వంలో..

Harish Rao: మేం ప్రశ్నించాకే కల్వకుర్తి నీటి విడుదల

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సాగునీరందక అవస్థపడుతున్న లక్షలాదిమంది రైతులతో తరలివచ్చి మోటార్లు ఆన్‌ చేస్తామంటేగాని ప్రభుత్వంలో చలనం రాలేదని, తాము ప్రశ్నించాకే.. కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమపార్టీ నిలదీస్తేగాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కదలికలేదని, ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్‌చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విజయమని మంగళవారం ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కల్వకుర్తిలాగానే.. కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఉపాధిహమీ ఏపీవోలకు మూడునెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని, మరోవైపు పారిశుధ్య కార్మికుల కూ వేతనాలు రాక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని హరీశ్‌రావు పే ర్కొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీవోలు, పారిశుధ్య కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 04:25 AM