Job Offers: సర్టిఫికెట్‌తో వచ్చేయండి.. జాబ్‌తో తిరిగి వెళ్లండి..
ABN , Publish Date - Apr 18 , 2025 | 06:03 PM
హైదరాబాద్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదిన ఈ క్రింది డాక్యుమెంట్లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావలెను.
హైదరాబాద్: భారతదేశంలో అగ్రగామి ఏరోస్పేస్ & డిఫెన్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) హైదరాబాద్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 20, 2025 ఆదివారం నాడు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. కంపెనీ అసెంబ్లీ ఆపరేటర్ కోసం నైపుణ్యం కలిగిన ITI గ్రాడ్యుయేట్లు & అప్రెంటిస్‌లను కోరుతోంది.
అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్లను తీసుకురావాలి:
పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో రెజ్యూమ్
ID ప్రూఫ్
విద్యా సర్టిఫికెట్లు
ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు (వర్తిస్తే)
ప్రస్తుత కంపెనీ జాయినింగ్ లెటర్, CTC వివరాలు
గత మూడు నెలల జీతం స్లిప్‌లు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్లు
స్థలం: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బేలా క్రాస్ రోడ్, IDA, బాలానగర్, హైదరాబాద్, తెలంగాణ – 500037.