Share News

జర్మన్‌ వర్సిటీలతో జేఎన్‌టీయూ ఒప్పందాలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:02 AM

అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో జేఎన్‌టీయూ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే స్వీడన్‌, యూఎస్‌ దేశాలకు చెందిన పలు యూనివర్సిటీలతో ఎంవోయూలు కలిగినజేఎన్‌టీయూ తాజాగా జర్మన్‌కు చెందిన రెండు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది.

జర్మన్‌ వర్సిటీలతో జేఎన్‌టీయూ ఒప్పందాలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో జేఎన్‌టీయూ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే స్వీడన్‌, యూఎస్‌ దేశాలకు చెందిన పలు యూనివర్సిటీలతో ఎంవోయూలు కలిగినజేఎన్‌టీయూ తాజాగా జర్మన్‌కు చెందిన రెండు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులతో పాటు ఇంజనీరింగ్‌ కోర్‌ బ్రాంచ్‌లకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించింది.


జేఎన్‌టీయూలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్‌, రాయిట్లింగన్‌, కాసెల్‌ వర్సిటీల ప్రతినిధులు ఎంవోయూల పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు జేఎన్‌టీయూ వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

Updated Date - Jun 20 , 2025 | 04:02 AM