Share News

Japan company: జపాన్‌ కంపెనీల కోసం టి-వర్క్స్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:29 AM

సెమీ కండక్టర్‌ ఉత్పాదనలో కీలకమైన కెమికల్‌ మెకానికల్‌ పాలిషింగ్‌ (సీఎంపీ) ప్యాడ్‌ ఏర్పాటుకు జపాన్‌ కంపెనీ సహకారం అందించనుంది.

Japan company: జపాన్‌ కంపెనీల కోసం టి-వర్క్స్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

  • మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

  • ఎంఎ్‌సఎంఈల కోసం సీఎంపీ ప్యాడ్‌

  • ఏర్పాటుకు ముందుకొచ్చిన జపాన్‌ కంపెనీ

  • దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సెమీ కండక్టర్‌ ఉత్పాదనలో కీలకమైన కెమికల్‌ మెకానికల్‌ పాలిషింగ్‌ (సీఎంపీ) ప్యాడ్‌ ఏర్పాటుకు జపాన్‌ కంపెనీ సహకారం అందించనుంది. ఇప్పటివరకు దీన్ని ఇక్కడి సెమీకండక్టర్‌ కంపెనీలు దిగుమతి చేసుకునేవి. అయితే రాష్ట్రంలోని సెమీ కండక్టర్‌ రంగంలో సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)ను ప్రోత్సహించాలన్న లక్ష్యంగా జపాన్‌కు చెందిన టొహోకోకి సంస్థ రూ.8 కోట్ల విలువైన సీఎంపీ ప్యాడ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ఎంఎం్‌సఎంఈల కోసం దీనిని రాయదుర్గ్‌లోని టి-వర్క్స్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టోహోకోకి గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ టకుయా నిషిమురా తెలిపారు.


గురువారం టి-వర్క్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు జపాన్‌ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. జపనీస్‌ పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధకుల కోసం టి-వర్క్స్‌లో ప్రత్యేకంగా ఒక ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ఞానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్‌లో తొలిసారి సీఎంపీ ప్యాడ్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Aug 29 , 2025 | 04:29 AM