Jagadish Reddy: సీఎం రమేశ్ చెప్పేవన్నీ అబద్ధాలే: జగదీశ్ రెడ్డి
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:33 AM
బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేశ్‌ను కలిసి దేవురించాల్సిన అవసరం తమకు లేదని, బీజేపీ పెద్దలతో మాట్లాడేంత సీన్ ఆయనకు ఉందా
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేశ్‌ను కలిసి దేవురించాల్సిన అవసరం తమకు లేదని, బీజేపీ పెద్దలతో మాట్లాడేంత సీన్ ఆయనకు ఉందా? అని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం రమేశ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, బ్రోకర్లు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.బీజేపీ తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదని, ఇక్కడ టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే.. బీఆర్‌ఎస్ ఎందుకు కలుస్తుందని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలముందు బీజేపీతో పొత్తు పెట్టుకుందామంటేనే.. కేసీఆర్ ఒప్పుకోలేదని, ప్రాణంపోయినా ఆ పార్టీతో పొత్తు ఉండదని తమతో చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జైపాల్‌రెడ్డి ఎన్నడూ పాల్గొనలేదని, రేవంత్‌వ్యాఖ్యలు శుద్ధ అబద్ధాలని పేర్కొన్నారు.