Share News

Minister Tummala: రైతులపై పెట్టుబడి పెట్టండి

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:55 AM

రైతులపై పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు దండుకొని విదేశాలకు

Minister Tummala: రైతులపై పెట్టుబడి పెట్టండి

  • మోసగించేవారికి రుణాలిస్తే ఎలా?

  • వేల కోట్లు తీసుకుని దేశం వదిలి పారిపోతున్నారు

  • రైతులైతే తీసుకున్న రుణానికి ప్రతిపైసా చెల్లిస్తారు: తుమ్మల

హైదరాబాద్‌/చిక్కడపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతులపై పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు దండుకొని విదేశాలకు పారిపోయేవారిపై నమ్మకం పెట్టుకుంటే ఏం లాభం? రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే నయాపైసా బాకీ లేకుండా వడ్డీతో సహా చెల్లిస్తారు. సరైన సమయంలో రైతులకు రుణాలిచ్చి బ్యాంకర్లు అండగా నిలబడాలి’’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాబార్డు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల మా ట్లాడారు. వ్యవసాయేతర రుణాలు తీసుకున్న వారు ఎగ్గొట్టినవి ఎన్ని ఉన్నాయో, వ్యవసాయ రుణాలు తీసుకున్న వారు ఏ మేరకు ఎగ్గొట్టారో బేరీసు వేసుకోవాలని సూచించారు. రైతులు కూడా పెద్దమొత్తంలో రుణా లు తీసుకుని ఎగ్గొట్టొచ్చా అని వ్యాఖ్యానించారు. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే గ్రామీణ బ్యాంకులు రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్నాయన్నారు. రైతులు, మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉన్నదని పేర్కొన్నారు. వ్యవసాయం, పశుపోషణ, సహకార సంఘాలు, ప్రకృతి వ్యవసాయం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధిలో నాబార్డు కృషి అభినందనీయమని ఆయన కొనియడారు.

Updated Date - Jul 16 , 2025 | 05:55 AM