Share News

Finance Department: సందీప్‌కుమార్‌కు ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు

ABN , Publish Date - May 14 , 2025 | 01:56 AM

ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు అప్పగించారు. సీఎస్‌ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Finance Department: సందీప్‌కుమార్‌కు ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు

  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలను 1998 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సందీ్‌పకుమార్‌ సుల్తానియాకు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే రామకృష్ణారావు ఈ నెల 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రభుత్వం ఆయనను రిలీవ్‌ చేసింది. ఆ బాధ్యతలను సందీ్‌పకుమార్‌కు అప్పగించింది. ఆయన ప్రజాభవన్‌కు వెళ్లి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - May 14 , 2025 | 01:57 AM