Medigadda Barrage: ‘మేడిగడ్డ’లో హైడ్రలాజికల్ పరీక్షలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:53 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలో హైడ్రలాజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మహదేవపూర్ రూరల్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలో హైడ్రలాజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిపుణుల బృందం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) తుది నివేదికలో పలు రకాల పరీక్షలు నిర్వహించాలని సూచించగా ప్రభుత్వం ఆ బాధ్యతలను సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు అప్పగించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే హైడ్రలాజికల్ విభాగానికి చెందిన ప్రసాద్ కున్‌జీర్, హర్ష చౌదరి నేతృత్వంలో నిపుణులు మంగళవారం సందర్శించారు. బ్యారేజీ వద్ద వరద ఉధృతి, పరీక్షలకు ఏయే బ్లాకులు అనుకూలమో పరిశీలించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ బుధవారం పరిశీలించనున్నారు.