Share News

Hyderabad: తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద యువతి హల్‍చల్.. భవనం పైకి ఎక్కి బాబోయ్..

ABN , Publish Date - Apr 19 , 2025 | 06:14 PM

హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వద్ద యువతి హల్ చల్ చేసింది. ఆస్పత్రి భవనం ఎక్కి దాదాపు రెండు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించింది.

Hyderabad: తాజ్‌ కృష్ణ హోటల్‌ వద్ద యువతి హల్‍చల్.. భవనం పైకి ఎక్కి బాబోయ్..

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఏఐజీ ఆస్పత్రి వద్ద ఓ యువతి హల్‍చల్ చేసింది. ఐదంతస్తుల ఆస్పత్రి భవనం ఎక్కి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగింది. శివలీల అనే యువతి ఏఐజీ ఆస్పత్రిలో తాత్కాలిక ఉద్యోగిణిగా పని చేస్తున్నారు. ఆమెను యాజమాన్యం ఇటీవల విధుల నుంచి తొలగించింది. అయితే ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని సదరు యువతి కోరగా యాజమాన్యం తొలుత ఒప్పుకోలేదు.


అయితే ఆగ్రహించిన యువతి ఆస్పత్రి భవనంపైకి ఎక్కింది. కిందికి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించగా.. బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందికి దింపే ప్రయత్నం చేశారు. అయితే యువతి మాత్రం పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యానికి చుక్కలు చూపించింది. తన వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తే దూకేస్తానంటూ హెచ్చరించింది. దాదాపు రెండు గంటలపాటు అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.


ఈ రెండు గంటలపాటు పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యం, యువతికి మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. చివరికి ఆమెను ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆస్పత్రి అధికారులు చెప్పడంతో పోలీసుల హామీ మేరకు ఎట్టకేలకు కిందికి దిగింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది. అయితే స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసేందుకు యత్నించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NIMS: నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..

Updated Date - Apr 19 , 2025 | 09:11 PM