Share News

Film Chamber: జోరుగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. ఈ సాయంత్రం ఫలితాలు

ABN , Publish Date - Dec 28 , 2025 | 09:56 AM

ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో జరగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు..

Film Chamber: జోరుగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. ఈ సాయంత్రం ఫలితాలు
Telugu Film Chamber of Commerce

హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) 2025-27కి సంబంధించి కార్యవర్గ ఎన్నికలు ఇవాళ(ఆదివారం) జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్లకు చెందిన మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడు, కార్యదర్శి సహా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడు బరిలో ఉండటం విశేషం.


ఎన్నికల్లో ప్రధాన పోటీ 'మన ప్యానెల్' ఇంకా 'ప్రోగ్రెసివ్ ప్యానెల్' మధ్య జరగుతోంది. చిన్న నిర్మాతలు ఎక్కువగా మన ప్యానెల్‌కు మద్దతిచ్చారు. ఈ ప్యానెల్‌ను సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్ బలపరిచారు.

మరోవైపు అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, డి.సురేశ్ బాబు మద్దతుతో ప్రోగ్రెసివ్ ప్యానెల్ బరిలో నిలిచింది. పోలింగ్ సమయంలో ఇరు ప్యానెళ్ల సభ్యుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది.

ఒక సందర్భంలో యలమంచిలి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య గొడవ జరిగింది. తర్వాత దిల్ రాజు జోక్యం చేసుకొని సముదాయించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తాయి. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి!


ఇవి కూడా చదవండి

ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..

పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

Updated Date - Dec 28 , 2025 | 10:15 AM