NSN Infotech: ఘరానా మోసం.. 400 మంది నిరుద్యోగుల డబ్బు స్వాహా
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:01 PM
ఐటీ కంపెనీ అంటూ హడావుడి చేశారు. మంచి కోర్సులకు శిక్షణ ఇచ్చి తమ కంపెనీలోనే ఉద్యోగాలు ఇస్తామంటూ దాదాపు 400 మంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తం 12 కోట్ల రూపాయల వరకూ దోచేసి, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు.
హైదరాబాద్, నవంబర్ 26 : ఐటీ హబ్‌గా పేరొందిన మాదాపూర్‌లో మరోసారి ఘరానా మోసం బయటపడింది. 'NSN ఇన్ఫోటెక్' పేరుతో నడిచిన ఒక ఫేక్ ఐటీ కంపెనీ, నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగం ఆశగా చూపి కోట్లాది రూపాయలు దోచుకుని రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది. దీని వెనుక మాస్టర్‌మైండ్ స్వామి నాయుడు, అతని ఫ్యామిలీ పరారీలో ఉన్నారు.
మోసం జరిగిన తీరు..
NSN ఇన్ఫోటెక్ కంపెనీ మాదాపూర్‌లోని ఓ భవనంలో గత కొన్ని నెలలుగా ఆఫీసు పెట్టుకుని కార్యకలాపాలు నడిపింది. 'ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ' వంటి హై-డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరం తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఫీజు వసూలు చేసింది. ఇలా.. మొత్తం 400 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ. 10–12 కోట్ల వరకు సొమ్ము సేకరించినట్లు తెలుస్తోంది.
అయితే, రోజూవలే ఈ ఉదయం క్లాసులకు వచ్చిన విద్యార్థులు షాక్ అయ్యారు. కంపెనీ బోర్డు తిప్పేసి, తలుపులు మూసి ఉన్నాయి. యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్. వాట్సాప్ గ్రూపులు డిలీట్. కంపెనీకి చెందిన స్వామి నాయుడు, అతని భార్య, మరికొందరు కీలక వ్యక్తులు జాడే లేకుండా పోయారు. విద్యార్థులు ఆఫీసుకు చేరుకుని తలుపులు తట్టినా ఎవరూ స్పందించలేదు. 'రెంట్ కూడా కట్టలేదు, ఎవరో వచ్చి లాక్ వేశారు' అని ఇంటి ఓనర్ చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో బాధితుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి.. యువకుడిపై పెట్రోల్ పోసి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..