BIG BREAKING: కవితకు కేటీఆర్ బిగ్ షాక్..
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:36 PM
ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు. కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ.. పేర్కొన్నారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ.. ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
కవిత చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే.. మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. దానితో పాటు బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త పార్టీకి కవిత రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగానే కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే.. రేపు కవితపై బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.