Share News

KCR : బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 10:58 AM

బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు క్యూకడుతున్నారు. కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరినట్టు సమాచారం. మరికాసేపట్లో జరిగే భేటీలో పలు అంశాలు చర్చించే..

KCR : బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు..  ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్ సహా  ముఖ్య నేతలు
Chief KCR calls on BRS leaders

హైదరాబాద్, ఆగస్టు 15 : బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు క్యూకడుతున్నారు. కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరినట్టు సమాచారం. మరికాసేపట్లో జరిగే భేటీలో పలు అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు ఈ సమావేశంలో కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తోంది. అటు అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్ట్ తదితర పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.


ఇక, ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం మీద ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని స్వా్తంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 15 , 2025 | 12:11 PM