Guidelines For Peaceful New Year: మందుబాబులకు డీసీపీ హెచ్చరిక.. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు..
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:21 PM
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ హైదరాబాద్ వాసులకు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, సంబరాలు ఆనందం నుంచి విషాదం వైపు మళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, సంబరాలు ఆనందం నుంచి విషాదం వైపు మళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ‘ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు ఉంటాయి. తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడొద్దు. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు. సుమారు వంద టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేస్తాము. నగరంలోని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి వేస్తాము.
ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యామ్నాయ డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ట్యాంక్ బండ్, ఎన్‌టీఆర్ మార్గ్‌పై ఎలాంటి వాహనాలు అనుమతించము. కేవలం నెక్లెస్ రోడ్డుపైనే వాహనాలు అనుమతిస్తాము. రేసింగ్, సైలెన్సర్లు తీసివేసి వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాహనాలను గుర్తించడానికి వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా జరుపుకోవాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!
న్యూ ఇయర్.. అదృష్టం కోసం ఈ వాస్తు నియమాలను పాటించండి.!