Share News

Police Patrol: హైదరాబాద్‌లో టపాసులపై నిషేధం

ABN , Publish Date - May 11 , 2025 | 05:00 AM

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు.. హైదరాబాద్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Police Patrol: హైదరాబాద్‌లో టపాసులపై నిషేధం

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌/శంషాబాద్‌ రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు.. హైదరాబాద్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పెట్రోలింగ్‌ చేపడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దృష్టి సారించాలని పోలీసులను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. గ్రేటర్‌ పరిధిలో టపాసులు కాల్చడాన్ని నిషేధించారు. బాణాసంచా తయారీని వెంటనే నిలిపివేయాలన్నారు. పరిస్థితులు సద్దుమణిగేంత వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


మరోవైపు, జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్‌ తుర్కియే జనరల్‌ కాన్సులేట్‌ వద్ద పోలీసులు భద్రత పెంచారు. యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌కు తుర్కియేనేడ్రోన్లను అందజేసిందన్న వార్తలతో ఆ దేశ కాన్సులేట్‌ వద్ద అల్లర్లు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా, భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పది కిలోమీటర్ల మేర డ్రోన్లు, రిమోట్‌తో ఎగిరే ఎలకా్ట్రనిక్‌ పరికరాలు ఎగురవేయడాన్ని నిషేధిస్తున్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి వెల్లడించారు. జూన్‌ 9 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.

Updated Date - May 11 , 2025 | 05:01 AM